Saturday, July 2, 2011

Subba Reddy

సుబ్బా రెడ్డి అంటే గుప్తా హౌసు ఆకు పచ్చ చొక్కా, కొట్టొచ్చినట్టు కనిపించేటి బుగ్గలు, ముఖం నిండా నవ్వు గబాల్న గుర్తుకొస్తాయి. వాడొక జర్నలిస్టని ఈ మధ్యనే నాకు  తెలిసింది. పేస్ బుక్ లో వాడి రాతలెప్పుడు సుటీగాను funny గాను ఉంటాయి. పద్దెనిమిదేళ్ళు దాటిపోయింది వాణ్ణి చూసి.
మొన్నో సారి JB గాడు, సుబ్బా రెడ్డి గురించి చెపుతూ, వాడు నగేష్ కుకునూరు సినిమాకి  సహాయక దర్శకుడని అన్నాడు. వీడి నుంచి కూడా ఓ ఆఫ్ బీట్ సినిమా ఒకటి తొందరలో చుస్తామేమో అనుకుంటూ ఎదురు చూస్తువున్నా. 
అంతలోనే వీడి కలం నుంచి జాలువారిన ఈ అమ్రుతాక్షరాలు చూడగానే, నా గుండె లోతుల్లో ఎక్కడో గనీభవించి నాకు కూడా కనిపించకుండా దాక్కున్న తెనుగు భావావేశం కరిగి పొంగి నాతో ఈ నాలుగు ముక్కలు రాయించింది. వాడి నాలుగు ముక్కలు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు 'సినబ్బ కతలు' మరియు ఖదీర్ బాబు కతలు చదివిన రోజులను గురుతుకు తెచ్చాయి. 
సుబ్బారెడ్డి వ్యాసంలో 'ఆహికున్టికల'  లాగానే దేశం వదిలి ప్రపంచము నలుచెరగులా వ్యాపించి ఉన్న మన తెలుగు జనం, వందల సంఖ్యలో ATAలు, TANAలు ఏర్పాటు చేసి తందనాలు ఆడి, నల్గురు తెలుగు రాని తెలుగు హీరోయిన్స్ ని, తెలుగు వచ్చి తెలుగులో మాటలాడని తెలుగు హీరోలని రప్పించి తెలుగుకి సేవ చెయ్యడం అయిపోయిదనుకుంటున్నారు. 
మనం తమిలోళ్ళలాగా ఈలం స్థాపించనక్కర లేదు. ఇంజనీరింగులు, మెడిసిన్లు అనే చట్రాల్నుంచి బయటికొచ్చి, మూస సినిమాల బారి నుంచి తప్పించుకుని మన జనం కోసం, మన భాష కోసం మనం అని కొందరు తెలుగు వాళ్ళయినా అనుకునే రోజులొస్తాయి అని ఎదురు చూస్తూ, సెలవ్ తీసుకుంటున్న. 
క్రింద మన సుబ్బా రెడ్డి వ్యాసానికి లింక్(మరలా):